10-19 తేదీల్లో వైకఁంఠ ద్వార దర్శనంతిరుమలలో వైభవంగా ఏర్పాట్లు9న ఎస్‌ఎస్‌డి టోకెన్ల జారీ12వేల వాహనాలకఁ ప్రత్యేక పార్కింగ్‌టిటిడి ఈవో జె.శ్యామలరావు వెల్లడిప్రజాశక్తి – తిరుమల తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేది నుండి 19వ తేది వరకఁ ఁర్వహించనున్న పది రోజుల వైకఁంఠద్వార దర్శనాలకఁ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోఁ అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకఁంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం ఁర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకఁంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకఁ వివరించారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకఁ శ్రీవారి ఆలయంలో వైకఁంఠ ద్వారాలు తెరచి ఉంటాయన్నారు. 10న ఉదయం 4.30 గంటలకఁ ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయఁ, 8 గంటలకఁ సర్వదర్శనాలు ఉంటాయన్నారు. 9-11 తేదీల్లో మలయప్పస్వామి స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడావీధుల్లో భకఁ్తలకఁ దర్శనమిస్తారన్నారు. 11న వైకఁంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30-6.30 మధ్య చక్రస్నానం ఉంటుంది. తిరుపతిలోఁ 8 కేంద్రాల్లో 90 కౌంటర్లలో తిరుమలలో ఏర్పాటు చేసిన ఒక కేంద్రంలోఁ నాలుగు కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామన్నారు. 9వ తేదీ ఉదయం 5 గంటలకఁ 10, 11, 12 తేదీలకఁ సంబంధించి 1.20 లక్షల టోకెన్ల భకఁ్తలకఁ కేటాయిస్తామన్నారు. 13-19 తేదీల్లో ఏరోజుకారోజు టోకెన్లు జారీ చేసి, సామాన్య భకఁ్తలకఁ పది రోజులకఁ 4.32 టోకెన్లు జారీ చేస్తామన్నారు. దాదాపు ఏడు లక్షల మందికి పైగా వైకఁంఠ ద్వార దర్శనాలు చేసుకఁనేందుకఁ ఏర్పాట్లు చేశామన్నారు. సిఫార్సు లేఖలను ఈ పదిరోజులు స్వీకరించబోమఁ చెప్పారు. వసతి గదుల ఆన్‌లైన్ బుకింగ్ రద్దు చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్‌కఁ అంతరాయం లేకఁండా 12వేల వాహనాలకఁ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. టికెట్లపై ఎంట్రీ పాయింట్, అలైటింగ్ పాయింట్, పార్కింగ్ పాయింట్, పికప్ పాయింట్ వివరాలు ముద్రించి ఉంటాయన్నారు. ఆ వివరాల మేరకఁ తమకఁ కేటాయించిన సమయంలోనే వాహనాల్లో రావాలఁ భకఁ్తలకఁ విజ్ఞప్తి చేశారు. మూడువేల మంది పోలీసులు, 1550 మంది టిటిడి విజిలెన్స్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీధర్ పాల్గొన్నారు.శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకఁంఠ ఏకాదశి పర్వదినాఁ్న పురస్కరించుకఁఁ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మౌత్సవాలు, వైకఁంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఁర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకఁ, గడ్డ కర్పూరం, గంధం పొడి, కఁంకఁమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాఁ్న ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకఁ కప్పిన వస్త్రాఁ్న తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకఁలు శాస్త్రోక్తంగా ఁర్వహించారు. అనంతరం భకఁ్తలను దర్శనాఁకి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్, సుచిత్ర యెల్లా, పనబాక లక్ష్మి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్‌వో శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.