‘ఓపీఎస్‌’ మాత్రమే ఆమోదిస్తాం తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా యుటిఎఫ్‌ నిరసనలు

'ఓపీఎస్‌' మాత్రమే ఆమోదిస్తాం తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా యుటిఎఫ్‌ నిరసనలు

‘ఓపీఎస్‌’ మాత్రమే ఆమోదిస్తాం తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా యుటిఎఫ్‌ నిరసనలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం కేంద్రం తీసుకురావాలనుకుంటున్న యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీంను ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒపిఎస్‌ను మాత్రమే ఆమోదిస్తామని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నినాదాలతో నిరసన తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల్లో స్పందన లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లా కార్యదర్శి దండు రామచంద్రయ్య, బండి మధుసూదన రెడ్డి, అవనిగడ్డ పద్మజ, చిళ్ళ సురేష్‌ పాల్గొన్నారు. సూళ్లూరుపేటలో శుక్రవారం సాయంత్రం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల నాయకులు నిరసన తెలిపినట్లు యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కావూరు ప్రభాకర్‌ తెలిపారు. నాయుడుపేట డిప్యూటీ తహశీల్దార్‌ ఎం.రాజేంద్రకు వినతిపత్రం అందజేశారు. నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల నాయకులు ఎ.హరిబాబు, కె.సుబ్బారావు, టి.గోవర్ధన్‌రెడ్డి, జి.శ్రీనివాసులు, కె.ప్రభుదాస్‌ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఓపిఎస్‌ అమయ్యే వరకూ యుటిఎఫ్‌పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ సంఘం జిల్లా సహాయ అధ్యక్షులు సూర్యప్రకాష్‌ స్పష్టం చేశారు. కె.మోహన్‌బాబు, ఒ.విజరుకుమార్‌, వై.విజయశ్రీ, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు. పుత్తూరులో ఎల్‌ఐసి కార్యాలయం నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు దాసరి మునెయ్య ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. గూడూరు ఆర్‌డిఒ కార్యాలయంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుధీర్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. రవి, మురళి మోహన్‌, వరప్రసాద్‌, మురళిసింగ్‌, నాగేశ్వరరావు, గురునాథం పాల్గొన్నారు.చిత్తూరు అర్బన్‌లో.. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లా అద్యక్షులు ఎం.సోమశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెన్షన్‌ అనేది భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఖాతరు చేయకుండా ఇలాంటి అంకెల గారడీ చేసే పెన్షన్‌స్కీంలను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజుకు వినతిపత్రం సమర్పించారు. పి.సుధాకర్‌రెడ్డి, ఎస్‌.రెహనాబేగం, రెడ్డెప్పనాయుడు, బాషా, సరిత, ఏకాంబరం పాల్గొన్నారు. పుంగనూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనలో యూటీఎఫ్‌ నేతలు సి వెంకటేశ్వర రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, రమణ, శంకర్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి, రెడ్డప్ప, సుబ్రహ్మణ్యం, రామయ్య, పోతయ్య,మురాదుల్ల, సూర్యప్రకాష్‌, లోకనాథ్‌ రెడ్డి, పితాంబరం, జగన్నాథ్‌, షబ్బీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. కార్వేటినగరం గాండ్లమిట్ట కూడలిలో నిరసన తెలిపారు. రాష్ట్ర నాయకులు దీనావతి, వేణుగోపాల్‌, పీతాంబర్‌రెడ్డి, రాబర్ట్‌ పాల్గొన్నారు. పలమనేరులో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జివి రమణ ఆధ్వర్యంలో పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ప్రకాష్‌, జిల్లా నాయకులు బాబు, కష్ణమూర్తి, ప్రసన్నకుమార్‌, ప్రజాసంఘాల నాయకులు గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, ఎల్‌ఐసి యూనియన్‌ నాయకులు మునిరాజా పాల్గొన్నారు.

➡️