నేడు తిరుపతిలో ‘వారాహి’ సభశ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్‌ప్రజాశక్తి – తిరుమల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షను బుధవారం విరమించారు. కూతుర్లతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు వెళ్లిన ఆయన శ్రీవారి సమక్షంలో తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం లడ్డూ కల్తీ గురించి కాదని, ప్రాయశ్చిత్త దీక్ష అనేది సనాతన ధర్మ రక్షణను ముందుకు తీసుకువెళ్లడానికి చాలా అవసరం’ అన్నారు. ఇదిలా ఉండగా తిరుపతిలో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని కోరుతూ, దానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను బుధవారం ఆవిష్కరించబోతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గురువారం జరిగే వారాహి సభలో పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకం లోని అంశాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు సమాచారం. పవన్ చేతిలో ఉన్న రెడ్ కలర్‌లో ఉన్న ఆ బుక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ బుక్ కవర్ పేజీపైన ధర్మో రక్షతి రక్షిత్ణ అని రాసి ఉంది. దాని కింద వారాహి అమ్మవారి చిత్రం కూడా ఉంది. అయితే ఆ బుక్ లో ఏముందని చర్చించుకుంటున్నారు. నేడు తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ స్కూల్‌లో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడే పుస్తకంలోని అంశాలను పవన్ స్వయంగా వెల్లడిస్తారని సమాచారం. ఎంఎల్‌సి పిడుగు హరిప్రసాద్, తిరుపతి రైల్వేకోడూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, అరవా శ్రీధర్, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.