గరుడ వాహన సేవలో కళా బృందాల ప్రదర్శనలుప్రజాశక్తి- తిరుమల: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గరుడ వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబందాలు 311 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన 15 మంది కళాకారులు ఆ రాష్ట్ర సాంప్రదాయ పూజా కునిత నృత్యం, 28 మంది యువతులు ‘నమస్తే గరుడ రథీ’ కృత్యం నేత్రపర్వంగా సాగింది. బృందంలోని 35 మంది చిన్నారులు కోఆర్గి నత్యం, బెంగుళూరుకు చెందిన 28 మంది మహిళా కళాకారుల గజలక్ష్మి నమోస్తుతే – భరతనాట్యం భక్తులకు తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు వెంకటేశ్వర వైభవం, శ్రీనివాస కళ్యాణం, వివిధ దేవతామూర్తుల వేషధారణ, భరతనాట్యం, కోలాటాలు అలరించాయి. కడపకు చెందిన 31 మంది చిన్నారులు ముద్ర డాన్స్, కొవ్వూరుకు చెందిన 30 మంది యువతులు డమరుకం డాన్స్ భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించింది.