రిజిస్ట్రేషన్లకు గడువు ఇవ్వండిమెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వినతిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగర పరిధిలోని క్లినికల్ ల్యాబ్ లను నిర్వహిస్తున్న తమకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకునేందుకు గడువు ఇవ్వాలని తిరుపతి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కోరారు. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులకు ఈ మేరకు మంగళవారం వినతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా అర్హత కలిగిన ల్యాబ్ టెక్నీషన్లేనని, తమకు పారామెడికల్ రిజిస్ట్రేషన్ ఉందన్నారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధ్రువీకరణతో పాటు అగ్నిమాపక, వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన అనుమతులు, జిల్లా అధికారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రాసెస్ లో ఉన్నాయన్నారు. అనుమతులు వచ్చేవరకు తమకు తమ ల్యాబ్లను నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని డీఎమ్ అండ్ హెచ్ ఓకు ఇచ్చామని చెప్పారు.
