వైఎస్సార్‌సీపీ ప్రచార రథానికి నిప్పుదర్యాప్తు చేస్తున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ ప్రచార రథానికి నిప్పుదర్యాప్తు చేస్తున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ ప్రచార రథానికి నిప్పుదర్యాప్తు చేస్తున్న పోలీసులుప్రజాశక్తి – ఎస్‌ఆర్‌ పురం: చిత్తూరు -పుత్తూరు జాతీయ రహదారి 49 కొత్తపల్లి మిట్టలోని దీపిక కళ్యాణ మండపం ఎదురుగా పార్కింగ్‌ చేసి ఉన్న వైఎస్‌ఆర్సిపి ప్రచారరథాన్ని గురువారం రాత్రి ఎవరు గుర్తు తెలీని దుండగులు ధ్వంసం చేసిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు… మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ 49 కొత్తపల్లిమిట్ట దీపిక కళ్యాణ మండపం ఎదురుగా పార్కింగ్‌ చేసి ఉన్న వైఎస్‌ఆర్సిపి ప్రచార రథాన్ని గురువారం రాత్రి ధ్వంసం చేసి గుర్తు తెలీని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. గతంలో వినాయకుడు గుడి ముందర ఉన్న వైఎస్‌ఆర్సిపి జెండా ఆవిష్కరణ దిమ్మలో ఉన్న శిలాఫలకాన్ని, కొత్తపల్లిమిట్ట నుంచి వివిపురం గ్రామానికి వేసి ఉన్న సిసి రోడ్డు ఓపెనింగ్‌ శిలాఫలకం, కొత్తపల్లి గ్రామం సమీపంలో ఉన్న మహాభారతం గుడి వద్ద గోడలో చిత్తూరు వైఎస్‌ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసి విజయానంద రెడ్డి పేరుపై పెట్టిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న కార్వేవేటినగరం సిఐ సత్తిబాబు, ఎస్‌ఆర్‌ పురం ఎస్సై రాజకుల్లయప్ప, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వైసిపి నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలపారు. గ్రామాలలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

➡️