‘బాడీ బిల్డింగ్‌’ను అభివృద్ధి చేస్తా : ప్రవీణ్‌

‘బాడీ బిల్డింగ్‌’ను అభివృద్ధి చేస్తా : ప్రవీణ్‌ ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఆంధ్రప్రదేశ్‌ బాడీ బిల్డింగ్‌ క్రీడను అభివృద్ధి చేస్తానని గోల్డెన్‌ ఇండియన్‌ బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ వై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆయనకు బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ వారు ఘనంగా స్వాగతం పలికి, కేక్‌ కటింగ్‌ చేసి, సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో పాలకొల్లు, .కావలి లో రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఈ సంవత్సరం ఒక క్రీడా పోటీల క్యాలెండర్‌ నీ త్వరలో తయారు చేయాలని రాష్ట్ర అసోసియేషన్‌కి సూచించారు. వచ్చే నెల నుండి ప్రతి జిల్లాలో సందర్శించి ఆ జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేన్‌ల అభివద్ధికి తోడ్పడతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ చైర్మన్‌ ఈ .వై కుమార్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.యునుస్‌ భాష, ఈ.సీ మెంబర్లు ఉదరు. రమణ. రాజా పాండే, సీనియర్‌ బాడీబిల్డర్లు పాల్గొన్నారు.

➡️