‘ఆక్రమణకు గురైన భూమిని పరిరక్షించండి’

'ఆక్రమణకు గురైన భూమిని పరిరక్షించండి'

‘ఆక్రమణకు గురైన భూమిని పరిరక్షించండి’ప్రజాశక్తి- తిరుపతి డెస్క్‌: మండలంలోని మర్రిమంద గ్రామంలో వికతమాల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 132, 133లో 70 సెంట్లు భూమిని 20 సంవత్సరాల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలనీ, కమ్యూనిటీ భవనాల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం మిగిలి ఉంచిన 70 సెంట్లు భూమిని గత వైఎస్సార్సీపి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిపారనిసిపిఎం పార్టీ మండల కార్యదర్శి కరిముల్లా ఆరోపించారు. వారి నుంచి ఈ భూమని కాపాడలని ఎంఆర్‌ఓకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని, ఇకనైనా ఆ భూమిని కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉందని డిమాండ్‌ చేశారు. వారి వెంట రైతు సంఘం నాయకులు కె.రంగయ్య, డివైఎఫ్‌ఐ నాయకులు రాంబాబు, వెంకటేశ్వరరావు ఉన్నారు.

➡️