ప్లాస్టిక్‌ వాడకం ఆపుదాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం – సూళ్లూరుపేటలో భారీ ర్యాలీ

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: సూళ్లూరుపేట, పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేదించాలని, ప్రజలు సహకరించాలని కోరుతూ శనివారం పట్టణంలో భారి ర్యాలీ చేశారు. కోగిలి జయరామిరెడ్డి సేవా సంస్థ, రోటరీ క్లబ్‌ల అద్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చేతులు మీదుగా వ్యాపారులకు, ప్రజలకు గుడ్డ సంచులను పంచి పెట్టారు. ఈ ర్యాలీలో టైనిటాట్స్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్‌ కవర్లు వద్దు గుడ్డ సంచులు ముద్దు, ప్లాస్టిక్‌ వాడకాన్ని ఆపుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు. తాసీల్ధార్‌ కార్యాలయానికి వెళ్లి కోగిలి జయరామిరెడ్డి సేవా సంస్థ చైర్మన్‌ కోగిలి సురేష్‌ రెడ్డి, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు తిరుమూరు సుధాకర్‌ రెడ్డి కలిసి రెవెన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు. ఈ ర్యాలీలో మునిసిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌ రెడ్డి ,కమిషనర్‌ కె.చిన్నయ్య, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆకుతోట రమేష్‌, తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి, అత్తిరాల కిరణ్‌ కుమార్‌ ,బెజవాడ విజయమ్మ, ఆరణి విజయభాస్కర్‌ రెడ్డి, వేనాటి దనుజయరెడ్డి, పచ్చవ మాధవ నాయుడు, రోటరీ క్లబ్‌ కార్యదర్శి రామకష్ణ ఏజీ కిషోర్‌, సేవా సంస్థకు చెందిన ఉదరు కుమార్‌, కష్ణ రెడ్డి, రాజేష్‌, మహేష్‌ ,సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️