– విజయవాడలో ధర్నాచౌక్ దగ్గర నిరసన దీక్ష
– వెటర్నరీ విద్యార్థులకు 25 వేల స్టైఫండ్ ఇవ్వాల్సిందే
ప్రజాశక్తి – క్యాంపస్ : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగే “నిరసన దీక్ష”కు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్వియూ ప్రధాన ద్వారం ఎదుట పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి, ఈ సంవత్సరం ఫిజు రియాంబర్షిమెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంకు ఎస్వియూ కార్యదర్శి వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. వెటర్నరీ విద్యార్థి సంఘం నాయకులు పవన్ నాయక్, నీలిమ మాట్లాడుతూ గత 38 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వెటర్నరీ విద్యార్థులకి నేటి ధరలకి అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా జంతు పరిరక్షణ కోసం ఎన్నో సేవలు చేస్తున్న వారితో సమానంగా చూడటం లేదని తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్ రవి మాట్లాడుతూ రాష్టంలో గత బకాయిలు ఇవ్వకుండా, నేటి విద్యా సంవత్సరం కూడా కొంత మాత్రమే ఫీజులు చెల్లించి చేతులు దులుపుకోవడం సరికాదని తక్షణమే ఫీజుల బకాయిలు అన్ని చెల్లించాలని, ఎపి పిజి సెట్ ను రద్దు చేసి యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిను కాపాడి ఆయా వర్సిటీలకే అడ్మిషన్స్ నిర్వహించుకోడానికి అవకాశం కల్పించాలని, మెడికల్ కళాశాల ప్రైవేటికరణ ఆపాలని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్మించి నడపాలని ఈ ప్రధాన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మార్చి 15న విజయవాడ ధర్నా చౌక్ దగ్గర జరిగే నిరసన దీక్షలో సమస్యలు ఎదురుకుంటున్న విద్యార్థులు అందరూ పాల్గొని సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారం కోసం అందరూ ఒక్కటై పోరాడి సాదించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు తేజ, వెటర్నరీ విద్యార్థి నాయకులు పి.నశ్వర్ ఖాన్, ఇజ్రా, ప్రవీణ, ఎస్ఎఫ్ఐ వర్సిటీ నాయకులు భాస్కర్, తిరుమలేష్, విద్యార్థులు పాల్గొన్నారు.