నారాయణవనంలో ఘనంగా పిటిఎం

Dec 7,2024 11:13 #Tirupati district

 ముఖ్య అతిథులుగా పాల్గొన్న సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం

ప్రజాశక్తి-నారాయణవనం : రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నారాయణవనంలో ఘనంగా ప్రారంభమైనది. ముందుగా కార్యక్రమం సరస్వతి పూజతో ప్రార్థనతో ప్రారంభమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు దీటుగాదీటుగా ఏర్పాటు చేయడానికి ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
ఏ ఆత్మీయ సమావేశాల ద్వారా తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకు పిల్లల విద్యకు సంబంధించి దగ్గర సంబంధాలు ఏర్పడతాయని విద్యలో పిల్లలు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో తెలుసుకోవచ్చున్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నారాయణవనం బాలికల ఉన్నత పాఠశాల ఒకప్పుడు బాలుర ఉన్నత పాఠశాల తో ఉండేదన్నారు. కోజికేషన్ గా ఉన్న బాలురు ఉన్నత పాఠశాలలో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చడానికి వాటికి నిధులు మంజూరు చేయడానికి ఎమ్మెల్యేగా స్థానికులతో కలిసి సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.
బాలికల ఉన్నత పాఠశాలను సుమారు 70 లక్షలతో అత్యధిక భవనాలను నియమించడంతోపాటు పిల్లలకు మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. పదవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు తీసుకురావడం జరిగిందన్నారు. పదవ తరగతిలోనూ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లోనూ మంచి ఫలితాలను పిల్లల సాధించిన పట్ల అభినందించారు. భవిష్యత్తులో కూడా తల్లిదండ్రుల కలలను నిజం చేయడం కోసం ఉపాధ్యాయులు మంచి చదువు అందించి మరింత గుర్తింపును పాఠశాలకు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. సత్యవేడు నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి తనవంతు ఇప్పటికే చాలా కష్టపడి నిధులు కూడా తెప్పించడం జరిగింది అన్నారు. కావున పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి మార్కులతో ఒత్తిని ఇతను సాధించి పాఠశాలకు నారాయణ మనం మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ మెంబర్ కోలేటి సుమన్ కుమార్, డాక్టర్ దర్శత్ రాజ్ డిప్యూటీ డిఇఓ ప్రభాకర్, రాజు హెడ్మాస్టర్ శశికళ సర్పంచ్ సారధమ్మ, గణేషన్, మాజీ ఎంపీపీ గోవిందస్వామి, మాజీ నెట్ కేఫ్ చైర్మన్ ఆర్డిఏకాంబరం పాఠశాల చైర్మన్ మోహన్సర్పంచ్ కుమారులు రామన్ లక్ష్మణ్, ఆరుమూగం పలువురు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.

➡️