నన్ను చంపేందుకే చెవిరెడ్డి కుట్రడిశ్చార్జ్‌ అనంతరం మీడియాతో పులివర్తి నాని

నన్ను చంపేందుకే చెవిరెడ్డి కుట్రడిశ్చార్జ్‌ అనంతరం మీడియాతో పులివర్తి నాని

నన్ను చంపేందుకే చెవిరెడ్డి కుట్రడిశ్చార్జ్‌ అనంతరం మీడియాతో పులివర్తి నానిప్రజాశక్తి – తిరుపతి, రామచంద్రాపురం:ఓటమి భయంతోనే, తనను చంపేందుకు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తనపై హత్యాయత్నం చేశారని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పేర్కొన్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ గేట్‌ ఎదుట మంగళవారం మధ్యాహ్నం వైసిపి నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘చంపేయండిరా.. బై ఎలక్షన్స్‌ వస్తాయి’ అంటూ వైసిపి మూక తనపై హత్యాయత్నానికి పాల్పడిందన్నారు. గన్మెన్‌ ధరణి లేకుంటే కచ్చితంగా తనను చంపేసే వారిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలకు సీల్‌ వెయ్యలేదని, వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఓటమిని భరించలేని చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఇలా తన అనుచరులతో హత్యాయత్నం చేయించడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తనపై దాడికి పాల్పడ్డ నిందితులంతా పుదుచేరిలో చెవిరెడ్డి ఆశ్రయం కల్పించాలని విమర్శించారు. అంతకు మునుపు తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున పులివర్తి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. వందలాది మంది కార్యకర్తలు తిరుచానూరుకు వస్తున్న నేపథ్యంలో సుధారెడ్డిని ముందస్తుగా తిరుచానూరు పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడిచిపెట్టారు. అయితే జిల్లా ఎస్పీ, పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని సుధారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హత్యాయత్నానికి పాల్పడి ఒక్కరోజు గడిచిన, 30మంది నిందితులకు సంబంధించిన వీడియో ఫుటేజీ అందించినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.హత్య రాజకీయాలు మంచి సంస్కృతి కాదు: సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతిరుపతి సిటీ: తిరుపతి లాంటి ఆధ్యాత్మిక విజ్ఞానాలయం ఉన్న ప్రాంతంలో ఇలాంటి హత్యారాజకీయ సంస్కృతి మంచిది కాదని, చంద్రగిరి నియోజకవర్గ పులివర్తి నానిపై ముందస్తు పథకం ప్రకారమే హత్య చేయడానికి పూనుకున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. బుధవారం పులివర్తి నానినీ ఆయన నివాస గృహంలో కలిసి పరామర్శించారు. నారాయణ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఈవీఎంలు దాల్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ ఉన్నా.. అక్కడ ఎలాంటి భద్రతా సౌకర్యాలు లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ఈవీఎంలు ఎత్తుకెళ్లి ఉంటే ఏంటి పరిస్థితిని ప్రశ్నించారు. ఇలాంటి హత్యా రాజకీయాలను ఎవరు ప్రోత్సహించకూడదని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, చిన్నం పెంచలయ్య, కె.రాధాకృష్ణ పాల్గొన్నారు.నానీని పరామర్శించిన సుధీర్‌శ్రీకాళహస్తి: చంద్రగిరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానీని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి బుధవారం పరామర్శించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని కౌంటింగ్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు మంగళవారం వెళ్లిన పులివర్తి నానీపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ నానీ తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతుండగా సుధీర్‌ రెడ్డి పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైసీపీ నాయకుల అరాచకాలకు త్వరలో గెలుపుతోనే బుద్ధి చెబుదామని నానికి సుధీర్‌ రెడ్డి ధైర్యం చెప్పారు.నానిని పరామర్శించిన ఎంపీ అభ్యర్థిచిత్తూరు అర్బన్‌: వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు బుధవారం తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళిమోహన్‌, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సీఆర్‌ రాజన్‌, టిడిపి సీనియర్‌ నేత చంద్ర ప్రకాష్‌, మాజీ మేయర్‌ హేమలత ఉన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు మంగళవారం వెళ్ళిన పులివర్తి నానిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి చేరుకోవడంతో నానిని స్విమ్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతున్న ఆయనను ప్రముఖులు పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో దాడిని వారు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్యగా పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️