నానిని పరామర్శించిన రఘురామ కృష్ణంరాజు

నానిని పరామర్శించిన రఘురామ కృష్ణంరాజు

నానిని పరామర్శించిన రఘురామ కృష్ణంరాజు ప్రజాశక్తి -రామచంద్రపురం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణంలో మంగళవారం సాయంత్రం వైసిపి రౌడీ మూకలు చేసిన దాడిలో గాయపడిన చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి వెంకట మణి ప్రసాద్‌ ( నాని)ను ఎంపీ రఘురామ కష్ణంరాజు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ లు గురువారం సాయంత్రం రఘునాథ రిసార్ట్స్‌ లోని పులివర్తి నాని ఇంటి వద్ద పరామర్శించారు. వైసిపి నాయకుల చేసిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. అనంతరం పులివర్తి నాని కుటుంబ సభ్యులను కలసి అధైర్య పడకండి, ఎన్నికల్లో పులివర్తి నాని ఘనవిజయం సాధించడం ఖాయమని భరోసా ఇచ్చారు. టిడిపికి 120-150 సీట్లు ఖాయమన్నారు. పవన్‌కల్యాణ్‌కు పిఠాపురంలో 55వేల మెజార్టీ వస్తుందన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టిడిపి అధ్యక్షుడు సిఆర్‌ రాజన్‌, శ్రీధర్‌ వర్మ, బ్యాంకు శాంతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️