వాటర్‌స్పోర్ట్స్ హబ్‌గా రాయలచెరువు రామచంద్రాపురం : రాయలచెరువు ప్రాంతాన్ని పర్యాటక, వాటర్‌స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రగిరి ఎంఎల్‌ఎ నాని, శాప్ ఛైర్మన్ ఎ.రవినాయుడు అన్నారు. శనివారం రాయలచెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. గత టిడిపి ప్రభుత్వంలో ర్యాపిడ్ స్పోర్ట్స్ సంస్థ ద్వారా రాయలచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకున్నామని, వైసిపి హయాంలో ఆ సంస్థ పారిపోయేలా చేసిందన్నారు. రాయలచెరువును రూ.350 కోట్లతో ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామన్నారు. శాప్ ఛైర్మన్ ఎ.రవినాయుడు మాట్లాడుతూ ర్యాపిడ్‌స్పోర్ట్స్ సంస్థ అధికారులతో చర్చించి అంతర్జాతీయ క్రీడా హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం రాయలచెరువులో వీరు బోట్‌షికార్ చేశారు. ఈ బోట్‌లో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ జి.నరసింహయాదవ్, మేకల తిరుమలరెడ్డి ఉన్నారు.