శ్రీ సిటీలో జపాన్‌ పరిశ్రమల ప్రతినిధులు

శ్రీ సిటీలో జపాన్‌ పరిశ్రమల ప్రతినిధులు

శ్రీ సిటీలో జపాన్‌ పరిశ్రమల ప్రతినిధులు ప్రజాశక్తి- సత్యవేడు: నూతనంగా నియమితులైన చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తకాహషి మునియో బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) ఆర్‌.శివశంకర్‌ ఆయనకు సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక నగరం ప్రగతి, ప్రత్యేకతల గురించి సమగ్రమైన ప్రదర్శన ఇచ్చారు. అనంతరం, శ్రీసిటీలోని జపనీస్‌ పరిశ్రమల అసోసియేషన్‌ సభ్యులతో కాన్సుల్‌ జనరల్‌ సమావేశమై చర్చించారు. ఇసుజు, ఐసన్‌, టీహెచ్‌కె పరిశ్రమలను సందర్శించి, అక్కడ పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు.

➡️