‘ప్రజాశక్తి’ వార్తకు స్పందన….ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)’చిట్టి చేతులు…. చెత్త సంచులు’ అనే శీర్షికన ‘ప్రజాశక్తి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన వార్తకు జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. మంగళం పరిధిలోని తిరుమల నగర్ ప్రాంతంలో పిల్లలను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రానికి పంపేట్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో మంగళవారం తిరుమల నగర్ అంగన్వాడి టీచర్ పుష్ప పిల్లలు నివాసముండే ఇంటికి వెళ్లి వారిని తయారుచేసి అంగన్వాడీ కేంద్రానికి తీసుకొని వెళ్లారు.