మహిళా సిబ్బందికి రివార్డులుమహిళ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో ఎస్‌పి సమీక్

మహిళా సిబ్బందికి రివార్డులుమహిళ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో ఎస్‌పి సమీక్

మహిళా సిబ్బందికి రివార్డులుమహిళ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో ఎస్‌పి సమీక్షప్రజాశక్తి- తిరుపతి సిటీ తిరుపతి మహిళా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సోమవారం సుమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో జరిగిన సమావేశంలో ప్రతి పోలీస్‌ అధికారులు, సిబ్బందిని పేరుపేరునా ఎస్పీ పలకరించి, ప్రస్తుతం మహిళల రక్షణ కోసం తిరుపతి నగరంలో అమలు చేస్తున్న మహిళా రక్షక్‌, పెట్రోలింగ్‌ వివరాలను గురించి తెలుసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన ప్రణాళికను గురించి దిశా నిర్దేశం చేశారు. మహిళల సమస్యలు, సైబర్‌ నేరాలు గురించి మహిళలకు అవగాహన కలిగించి, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో కూడా నిఘా ఉంచాలని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వారు చేసిన మంచి పనిని, గుర్తించి వారికి రివార్డ్‌ ఇవ్వాలన్నారు. గత సంవత్సరం రోజులుగా ఎవరైనా అసాధారణ మంచి పనిచేసి ఉంటే తగిన ప్రోత్సాహకాలు (రివార్డులు) ఇవ్వడం ద్వారా పోలీసులను మానసికంగా ఉత్తేజపరిచినట్లు అవుతుందని అన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాలని, మహిళా సమస్యలు చాలా భిన్నమైనవిగా వస్తుంటాయని, మీరు శిక్షణ పొంది వచ్చారు కనుక సమస్యను పరిష్కరించే దిశగా వారితో మాట్లాడాలని, ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించకూడదని, మాట్లాడకూడదని సూచించారు. తిరుపతి టెంపుల్‌ టౌన్‌ అని, తిరుపతిలో కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నందున అవగాహన కార్యక్రమాలు చేపట్టి, మంచి ఫలితాలు తీసుకురావాలని, అదే సమయంలో పోలీసులు తమ జీవితాలను సమస్యలు భారి నుండి కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే నేరుగా తనకు గానీ, అదనపు ఎస్పీలు అడ్మిన్‌కి గానీ, క్రైమ్‌కి గానీ తెలియపరిస్తే సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు, విమల కుమారి, డిఎస్పిలు వెంకటాద్రి ఎస్బి, రమణ కుమార్‌ ట్రాఫిక్‌, సీఐ శరత్‌కుమార్‌, మహిళాపోలీసులు పాల్గొన్నారు.

➡️