నిబంధనలు గాలికి..పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలుఎలాంటి పన్ను కట్టని వ్యాపారులుపాఠశాల, నివాస గహాలు, ఆర్‌అండ్‌బి రోడ్లు పక్కనే తయారీ ఇదీ ఇటుక బట్టీల యజమానుల తీరు

నిబంధనలు గాలికి..పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలుఎలాంటి పన్ను కట్టని వ్యాపారులుపాఠశాల, నివాస గహాలు, ఆర్‌అండ్‌బి రోడ్లు పక్కనే తయారీ ఇదీ ఇటుక బట్టీల యజమానుల తీరు

నిబంధనలు గాలికి..పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలుఎలాంటి పన్ను కట్టని వ్యాపారులుపాఠశాల, నివాస గహాలు, ఆర్‌అండ్‌బి రోడ్లు పక్కనే తయారీ ఇదీ ఇటుక బట్టీల యజమానుల తీరుప్రజాశక్తి -కోట నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎండాకాలం సమీపించడంతో ఇప్పటి నుండే ఇటుకల వ్యాపారం మొదలైంది. ఇతర ప్రాంతాల నుండి కూలీలను తీసుకువచ్చి ఇక్కడ వ్యాపారులు కనీస నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా వ్యాపారం చేయడం పలు సమస్యలకు దారి తీస్తోంది. కనీసం అధికారులు అక్రమ ఇటుక బట్టీల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. నిబంధనలు గాలికి..మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడుతున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ వుంది. ఈ నేపథ్యంలో కోట మండలంలోని వెంకన్నపాలెం గ్రామం పక్కనే వాకాడుకు వెళ్లే మెయిన్‌ ఆర్‌ అండ్‌బిరోడ్డు పక్కనే భారీ స్థాయిలో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇటీవల ఓ యజమాని ఇష్టానుసారం రోడ్డు పక్కనే వ్యాపారం కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది. అది కాకుండా పచ్చని పంట పొలాల్లో ఇలా ఇటుక బట్టీలు తయారు చేయడం వల్ల పక్కనే ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. రోడ్డు పక్కనే బట్టీలకు నిప్పు పెట్టడంతో రోడ్డు మొత్తం పొగతో నిండుతోంది. దీంతో ఆ దారిలో వచ్చివెళ్లే ప్రయాణికులకు పలు సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ పొగ రోడ్డుమీదికి వస్తే ప్రయాణికులు కళ్లు మూసుకోవడంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తిమ్మనాయుడుపాళెంలో ప్రాథమిక పాఠశాల పక్కనే ఓ యజమాని ఇటుక బట్టీలు నిబంధనలకు విరుద్ధంగా తయారు చేయడంతో పాఠశాల కిటికీల్లో నుండి పొగ, దుమ్ము, దూళితో నానారకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క విద్యార్థుల తల్లిదండ్రులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో పక్క నివాస గహాలు పక్కనే ఇటుక బట్టీలు తయారు చేయడం వల్ల దుమ్ము, దూళి, పొగ, వాసన లాంటివి ప్రత్యక్షంగా పరిసర గ్రామాలను చుట్టుముట్టుతున్నాయి. దుస్తులు ఉతికి బయట ఆరేసుకోవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఇటుక బట్టీలు కాల్చేటప్పుడు వచ్చే వాసన భరించలేక దుస్థితి నెలకొందని కొంత మంది గహిణిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవనం కూడా నలుపు రంగులోకి మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి పన్ను కట్టని వ్యాపారులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నా.. వీటి నిర్వాహకులు గ్రామ పంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారంలో 2 శాతం పన్ను చెల్లించాలని నిబంధనలు ఉన్నా బట్టీల వ్యాపారులు పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సమీపంలోనే సుమారు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ఒక్క మండలంలోనే 50కు పైగా బట్టీలు ఉన్నాయి. ప్రతి బట్టీలోనూ దాదాపు లక్ష నుంచి పది లక్షల వరకు ఇటుకలు కాల్చి ఒక్కొక్కటి రూ.7 చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యాజమాని కనీసం ప్రతీ వేసవిలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇటుకలు విక్రయిస్తారు. వీటి ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయలు వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ పంచాయతీలకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని పంచాయతీ, రెవెన్యూ, విద్యుత్‌ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? లేదా ఏదైనా ఇటుక బట్టీల యాజమాన్యం, అధికారులు మధ్య తత్సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అని స్థానిక సమీప నివాస ప్రజలు గుసగుసలాడుతున్నారు. విక్రయ సమయంలో ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీ రాజ్‌ యాక్టు ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2 శాతం పంచాయతీ ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయాల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలు దారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతీ ఇటుక బట్టీతో వ్యాపారులు లాభాలు ఆర్జిస్తుంటే పంచాయతీలకు మాత్రం పన్ను కట్టడం లేదు. బట్టీల నిర్వహణకు పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా వాటినీ పట్టించుకోవడం గమనార్హం.పచ్చని పొలాల్లో ఇటుకబట్టీల వ్యాపారం భూ పరిరక్షణ చట్టం ప్రకారం వ్యవసాయానికి పనికి రాని భూముల్లోనే ఇటుక బట్టీలు నిర్వహించాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పచ్చని పంట భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులకు మామూళ్లు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. మండల కేంద్రానికి, గ్రామాలకు కూత వేటు దూరంలోనే ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా పంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో పంట పొలాల్లో ఇటుక బట్టీలను కొనసాగిస్తుండడం గమనార్హం. పచ్చని పొలాల పక్కనే ఇటుక బట్టీలు నిర్వహిస్తుండడంతో ఆ ప్రభావం వాటిపై పడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.అధికారుల పర్యవేక్షణ శూన్యం..పట్టించుకోని అధికారులు.. ఇదిలా ఉండగా పంచాయతీ అసైన్డ్‌ భూముల్లో సైతం ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అంతే కాకుండా కొన్ని ఏజెన్సీ గ్రామాల్లో ఇటుక బట్టీ వ్యాపారులు అటువైపు నుంచి ప్రవహిస్తున్న వాగుల్లోనే, వ్యవసాయ విద్యుత్‌ మోటార్లను కమర్షియల్‌ విద్యుత్‌ మోటార్లుగా ఏర్పాటు చేసి ఇటుకల తయారీ కోసం నీళ్లు ఉపయోగిస్తున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. యథేచ్ఛగా ఇటుక బట్టీల వ్యాపారులు వాగులకు మోటార్లు ఏర్పాటు చేసుకుని ఇటుకల తయారీకి వాడుకోవడంతో వాగులో నీళ్లు ఇంకిపోతున్నాయి. దీంతో పంటల సాగుకు నీళ్లు పూర్తి స్థాయిలో అందక పంటలు సైతం ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వెంటనే పరిశీలిస్తాం పాఠశాల పక్కనే ఇటుకల బట్టీలు నిర్వహించడం పై ‘ప్రజాశక్తి’ ఎంఈవోను వివరణ కోరగా నిజమే కదా..? విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా చూస్తాం.. వెంటనే పరిశీలిస్తాం..- దారా మస్తానయ్య, కోట ఎంఈవో.నానా ఇబ్బందులు పడుతున్నాం.. ఇటుక బట్టీల తయారీ వల్ల మా గహాలు అంతా దుమ్ము, ధూళి, పొగతో నిండి పలు రకాల ఇబ్బందులు పడుతున్నాం.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు.-కోసన వసుంధర, స్థానికురాలు. మా సమస్యలు పరిష్కరించండి.. అధికారులు మా సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలి..- సుజాతమ్మ , పేట.

➡️