విశ్రాంత పోలీస్ సిబ్బందికి సత్కారం ప్రజాశక్తి -తిరుపతి సిటీ సెప్టెంబర్ నెలలో ఉద్యోగ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేసి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. తిరుపతి ట్రాఫిక్ ఏఎస్‌ఐ జనార్ధన్ నాయడు, సి గోపాల్ రెడ్డి, తిరుచానూరు ఏఎస్‌ఐ ఎండి జీవరత్నం, ఆర్మ్‌డ్ రిజర్వుడు హెడ్ కానిస్టేబుల్ ఎస్. వి. శంకర ప్రసాద్ రెడ్డి పదవి విరమణ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగం వేరు.. పోలీస్ ఉద్యోగం వేరు.. అలాంటి శాఖలో సుదీర్ఘ కాలం బాధ్యతాయుతంగా సేవలు అందించి పదవి వీరమణ పొందడం అభినందనీయం అన్నారు.
