సీతమ్మ అన్నదానాలు నిరంతరాయం : జనసేనప్రజాశక్తి-శ్రీకాళహస్తి జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తిగా అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి వినుత కోటా అన్నారు. స్థానిక ఆర్టీసీ సర్కిల్లో నాల్గో గురువారం పేదలకు అన్నదానం నిర్వహించారు. వినుత కోటా మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ ఎంతోమంది పేదల ఆకలిని తీర్చారని కొనియాడారు. ఆమె సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు జనసేన ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి గురువారం నిరంతరాయంగా జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అనంతరం 250 మంది పేదలకు అన్నదానం చేశారు. వీరమహిళలు గాయత్రి, శారద, నిర్మల పాల్గొన్నారు.
