ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి జిల్లా): పిచ్చాటూరుకు చెందిన తమిళనాడులోని ఊతుకోట ఎస్ ఐ ఎం.జీ రాజేంద్రన్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. రాజేంద్రన్ ఊతుకోటలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వేకవజామున రాజేంద్రన్ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పిచ్చాటూరులోని స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
