ఆరుగురు ముద్దయులు అరెస్టు72 కేజీల గాంజా, మూడు కార్లు స్వాదీనంప్రజాశక్తి తిరుపతి సిటీ తిరుపతి జిల్లా తడ, చిల్లకూరు పోలీసు స్టేషన్ అధికారులు కీలక ఆపరేషన్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 5 మంది, పుత్తూరు కు చెందిన ఒకరు మొత్తం 06 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి మొత్తం రూ.25,50,000/- విలువగల గాంజా మరియు 03 కార్లు స్వాదీనం. చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శ్రీ సిటీ జీరో పాయింట్ గోప్యమైన సమాచారం ఆధారంగా ఉదయం 6:00 గంటల ప్రాంతంలో సి.ఐ మురళీకృష్ణ, ఎస్.ఐ కొండప్ప నాయుడు, పోలీసు సిబ్బంది ఒక కారులో చెన్నైకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయితోపాటు షారుక్ ఖాన్ (24), అరుల్ (24) అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గంజాయిని పసుపులేటి గిరి బాబు, మోహన్ మదన్ కుమార్, పంజనాదన్ అజయ్, మునుసుందరం కీరుబాకరణ్ అనే వ్యక్తుల వద్ద నుంచి కొనుగోలు చేసి తమిళనాడు ప్రాంతాలలో విక్రయిస్తున్నారని వెల్లడించారు. చిల్లకూరు పోలిస్ స్టేషన్ పరిధిలో.. కోట క్రాస్ రోడ్డు, కడివేడు గ్రామంలో 72 కిలోల గంజాయి, రెండు కార్లు మొత్తం విలువ సుమారు రూ. 16,00,000లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కాకినాడ జిల్లా తుని ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, చెన్నై సమీపంలోని గుమ్ముడిపూండి, పుత్తూరు పరిసర ప్రాంతాలలో విక్రయాలు చేస్తూ అధిక లాభాలు పొందాలని ప్రయత్నించారు. పోలీసుల తనిఖీలను చూసి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, చిల్లకూరు పోలీసులు, ఎంఆర్ ఓ సిబ్బంది సత్వర చర్యతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అబినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచారి, డి.యస్.పి లు రమణ కుమార్, చెంచు బాబు, సి.ఐ లు, యస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.