ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : స్మార్ట్ సిటీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తాను తెప్పిస్తానని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. బుధవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని తిరుపతి స్మార్ట్ సిటీ పథకంలో జరుగుతున్న అభివృద్ధి పనులు తుడాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసలు మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అవి పూర్తి చేయడానికి సుమారు 25 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ తన వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు కొన్ని ఆగిపోయాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తిరుపతి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పథకంలో రావాల్సిన నిధుల గురించి వారి దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించిన కృషి చేస్తానని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి భూ సమస్యను త్వరలో పరిష్కరించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం శెట్టిపల్లి తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉందని దాన్ని తుడా పరిధిలో తీసుకువచ్చి అక్కడ ఉన్న భూములు లేఅవుట్లు వేసి వచ్చిన ఆదాయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అధికారులు ఈ దిశగా పనులు చేయాలని కోరారు కార్పొరేషన్ పరిధిలో ఉండే నాలుగు పార్కులను తుడాభివృద్ధి చేసే విధంగా చూడాలని ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ ,తుడా వైస్ చైర్మన్ మౌర్య తిరుపతి స్మార్ట్ సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ తిరుపతి కార్పొరేషన్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ తుడా ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
