బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ

బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ

బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ప్రజాశక్తి- తిరుపతి సిటీ: జిల్లా ఎస్పీగా ఎల్‌.సుబ్బరాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని, అనునిత్యం శ్రీవారి దర్శనార్థం ఇక్కడికి భక్తులు వస్తుంటారని, వారికి ఎలాంటి సమస్యలు లేకుండా శాంతి భద్రతలను కాపాడుతామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంచి పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేసి, పోలీస్‌శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా పనిచేస్తామన్నారు. చట్టానికి లోబడి పోలీస్‌ శాఖ పనిచేస్తుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, మీడియా, ప్రజాప్రతినిధుల సహకారంతో సమర్థవంతంగా శాంతిభద్రతలను కాపాడుతామని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, విమల కుమారి, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా పోలీస్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొని జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడుని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి లోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్చము అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీని కలిసిన జిల్లా ప్రజారవాణా అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడును జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్‌ రెడ్డి మర్యాదపూర్వ కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు డిప్యూటీ సిటిఎం భాస్కర్‌ రెడ్డి కూడా హాజరై దుస్సాలతో ఎస్పీని సత్కరించారు.

➡️