రేపే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంధ్వజారోహణ దర్భచాప, తాడు ఊరేగింపుప్రజాశక్తి – తిరుమలశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డిఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకంబ్రహ్మౌత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మౌత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తోంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి రమణారెడ్డి, శ్రీనివాసులు, రామకోటి తదితరులు పాల్గొన్నారు.వినియోగదారులకు అత్యుత్తమ సేవలే లక్ష్యం : సిఎండిప్రజాశక్తి – తిరుపతి సిటి మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా వినియోగదారుల సేవే పరమావధిగా భావించి, విద్యుత్ ఉద్యోగులు, వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు పేర్కొన్నారు. ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం(విద్యుత్ నిలయం)లో బుధవారం ఉదయం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి కె. సంతోష రావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సముపార్జనకు మహాత్మా గాంధీ అహింసా మార్గంలోనే అనేక ఉద్యమాలను చేపట్టి, వాటిని విజయవంతం చేశారని తెలిపారు. ఉద్యమాల్లో గాంధీజీ అవలంభించిన మానవతావాదం, అహింస, శాంతి సిద్ధాంతాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించడం గొప్ప విషయమని వివరించారు. నేటి సమాజంలో యువత గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ సమాజాభివద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు (ఎఫ్‌ఎసి) పి. అయుబ్ ఖాన్, వై. లక్ష్మీనరసయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణా దేవి, డి.ఎస్. వరకుమార్, కె. ఆర్. ఎస్. ధర్మజ్ఞాని, కె. ఆదిశేషయ్య, పి.హెచ్. జానకిరామ్ పాల్గొన్నారు