ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలుప్రజాశక్తి- తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వెనుకవైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నులపండుగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడుసేవను టీటీడీ రద్దు చేసింది.కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఈవో ఏవి ధర్మా రెడ్డి దంపతులు, జేఈఓ గౌతమి, సిపిఆర్వో డాక్టర్‌ టి.రవి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

➡️