మహిళా వర్సిటీలో రాష్ట్రస్థాయి రౌండ్‌ టేబుల్‌ సదస్సు

మహిళా వర్సిటీలో రాష్ట్రస్థాయి రౌండ్‌ టేబుల్‌ సదస్సు

మహిళా వర్సిటీలో రాష్ట్రస్థాయి రౌండ్‌ టేబుల్‌ సదస్సుప్రజాశక్తి – క్యాంపస్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం సంయుక్తంగా స్టేట్‌ లెవెల్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ లో ‘ట్రాన్స్ఫార్మింగ్‌ కన్వెన్షనల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్‌ టు మార్కెట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామ్స్‌’ అంశంపై బుధవారం రౌండుటేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య భారతి మాట్లాడుతూ నూతన విద్యా విధానం 2020 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులు ఉపాధి అందుకునేలా నైపుణ్య ఆధారిత కరిక్యులం రూపొందించాలని తెలిపారు. గౌరవ అతిథి రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌ రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాల నుండి మొత్తం 15 సబ్జెక్టులలో నిష్టాతులైన ప్రొఫెసర్లు పాల్గొని కర్క్యులం ఫ్రేమ్‌ వర్క్‌ రూపొంది ంచాలని తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయం డీన్‌ అకాడమిక్‌ ఎఫైర్స్‌ ఆచార్య జి దాము మాట్లాడుతూ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులలో జీవన నైపుణ్యాలు ప్రముఖ పాత్ర వహించాలన్నారు. ఈ కార్యక్రమం కన్వీనర్‌ టిజి అముద వల్లి మాట్లాడుతూ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే తక్షణ ఉపాధి మార్గాలను అందు కునేలా నూతన సిలబస్‌ రూపొం దించాలని సూచించారు. విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొత్త సిలబస్‌ స్కిల్‌ ఓరియంటెడ్‌ గా టెక్నాలజీ ఓరియెంటెడ్‌ గా రీసెర్చ్‌ ఓరియెంటెడ్‌ గా ముఖ్యంగా స్టూడెంట్‌ ఓరియంటెడ్‌ గా స్టూడెంట్‌ బెనిఫిటెడ్‌ గా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఆచార్య మమత, ఆచార్య అరుణ, వివిధ విభాగాల ఆచార్యులు, ఆంధ్రప్రదేశ్‌ లోని వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు పాల్గొన్నారు.

➡️