– ప్రైవేట్ ఏజెన్సీ వద్దు ఆప్కాస్ ముద్దు
ప్రజాశక్తి – క్యాంపస్ : ఎన్డిఎ కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఆప్కాస్ రద్దు చేస్తానన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని, జీవో నెంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైమ్ స్కేలు వర్తింపజేయాలని కోరుతూ శుక్రవారం అగ్రికల్చర్ కాలేజీ మెయిన్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేయడం వల్ల ఒక లక్షా 20 వేల మంది నష్టం జరుగుతుందని వాపోయారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే, పారిదర్శకత లోపించి, నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజకీయ ప్రమేయం, ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందని అన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాద, ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్ సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు ఔట్సోర్సింగ్ నియమకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని విమర్శించారు. నియామకాలలో పారదర్శకత, సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదన్నారు. ప్రభుత్వం తప్పుకోవడం, ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్నారు. ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో, సాఫ్ట్వేర్ తో పారదర్శకంగా నియమకాలు జరపడం, త్వరగా నియామకాలు పూర్తి చేయడం చాలా సులువు, అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పలు ఆరోపణలకు కారణం అవుతుందని అన్నారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక ముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరిలను రకరకాల ఏజెన్సీలకు ముక్కలు, ముక్కలుగా విడదీసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఏజెన్సీలు పీఎఫ్ చెల్లించకుండా, ఈఎస్‌ఐ కట్టకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగి నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు సొంత అకౌంట్లో డబ్బులు వేసుకొని ఉద్యోగులు డబ్బులు దోచుకుని తిన్నారు. పలు అక్రమాలకు పాల్పడిన చర్యలు లేవు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారన్నారు. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పోరాటం చేస్తే గత ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులందరిని ఒక గొడుగు కిందికి తీసుకొని వచ్చిందని అన్నారు. ప్రభుత్వ నిర్వహణలో నడుస్తున్న ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ను మళ్లీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం అంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని తిరుపతి జిల్లా జేఏసీ గా భావిస్తున్నామన్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాబినెట్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ నేరుగా డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా నింపి, నేరుగా జీతాలు ఇవ్వాలి. ఇప్పటివరకు పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ కాంట్రాక్టు పద్ధతిలో ఒక మార్చి ఆయా డిపార్ట్మెంట్లు నేరుగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆప్కాస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, శంకరయ్య, మునిరాజా, వాణిశ్రీ, రమేష్, రవి, మోహన్, గురవయ్య, పరంధామయ్య, సుబ్రహ్మణ్యం, యుగంధర్, భార్గవ్, బాబు, నందు, ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.