ఎస్‌విఎంసి ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి సిటీ ఎస్‌వి వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం యంబిబిఎస్ నూతన వైద్య విద్యార్థినీ విద్యార్థినులకు ఒరియంటేషన్ క్లాసులను ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. ఎస్వీఎంసీ ఆడిటోరియంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి అన్నట్టుగా, తల్లి తండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టుదలతో వైద్య విద్యను అభ్యసించాలి అని విద్యార్థులకు సూచించారు.వైద్య కళాశాలలో బోధనా పద్దతులపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రుయా సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు తెలిపారు. ఎస్ వి వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఫ్రీ జోన్‌గా పేర్కొన్నారు. ప్రసూతి ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ బి.పార్థసారధి రెడ్డి, ఎస్ వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ వెంకటేశ్వర్లు (పరిపాలన ) , సునీత సిరిగిరి, (అకాడమిక్), బి ఎస్ ఎన్ మూర్తి, (పరిశోధనలు ),పాహిం, సుజాత పాల్గొన్నారు.