కూటమి సర్దుపోటు!వినియోగదారులపై విద్యుత్ బిల్లుల భారం వచ్చే నెల నుంచి యూనిట్‌కు రూ.1.21పైసల పెంపు 15నెలల పాటు అదనపు భారమేసర్దుబాటు పేరుతో అదనపు వడ్డనఅసంతప్తి వ్యక్తం చేస్తున్న వినియోగదారులుప్రజాశక్తి-డక్కిలి: విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే వినియోగదారులను ప్రభుత్వాలు దొంగ దెబ్బ తీస్తున్నాయి. పరోక్షవడ్డింపులతో సామాన్యులు తల్లడిల్లుతున్నారు. విద్యుత్ బిల్లులు చూస్తేనే షాక్‌కు గురవుతున్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు చార్జీల బాదుడు తీవ్రతకు వామ్మో అనాల్సిందే. ఎడా పెడా వేస్తున్న సర్దుబాటు ఛార్జీలు మరింత భారంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వహయాంలో ఒకేసారి మూడు సర్దుబాటు చార్జీలను వినియోగదారులపై భారం వేసింది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు, విద్యుత్ బిల్లులు మరింత కుంగదీస్తున్నాయని పేద, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. మళ్లీ ఎప్పుడో వచ్చిన నష్టాలను బూచిగా చూపి ఇప్పుడు సర్దుబాటు చార్జీల పేరిట ప్రజల నుంచి రాబ ట్టేందుకు రంగం సిద్ధం అయింది. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమంటూ కూటమి నేతలు ప్రజలకు భరోసా కల్పించారు. అయితే సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో అసంతప్తి వ్యక్తమవుతోంది. టారిఫ్‌తో సంబంధం లేదు. శ్లాబ్ రేట్లతో అసలే సంబంధం లేదు. ఎవరు ఎన్ని యూనిట్లు వాడుకున్నారనేది కూడా వాళ్లకు అనవసరం. వినియోగదారులు ఎన్ని యూనిట్లు వాడుకుంటే అన్ని యూనిట్లకు శ్లాబ్ రేట్ ప్రకారం బిల్లు చెల్లించడంతో పాటు ప్రతీ యూనిట్‌కు అదనంగా మరికొంత చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2022-23 సంవత్సరంలో జరిగిన కొనుగోలు నష్టాలను సాకుగా చూపి ఆ వ్యయాన్ని సంస్థ వినియోగదారులపై సర్దుబాటు పేరుతో వేసేందుకు నిర్ణయించుకుంది. ప్రతి నెలా వస్తున్న విద్యుత్తు బిల్లులో వచ్చే నెల నుంచి యూనిట్‌కు రూ.1.21 పైసల అదనపు ఛార్జీల రూపంలో వసూలు చేసుకు నేందుకు ఈఆర్‌సి విద్యుత్ సంస్థకు అనుమతి చ్చింది. ఈ సర్థుబాటు చార్జీలు 15నెలల వరకు వినియోగదారులు భరించాల్సి ఉంది. పెరుగుతున్న నిత్యవసర ధరలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటంబాల వారు ఇప్పటికే వస్తున్న విద్యుత్ బిల్లులను చూసి గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 1744432 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 1251424 కనెక్షన్లు గహావసరాలకు సంబంధించినవి. మిగిలినవి పరిశ్రమలు, వ్యవసాయ, వీధి దీపాలు, తాగునీటి పథకాల కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెల జిల్లా వాసులు తమ గహ అవసరాల కోసం సరాసరి 110 యూనిట్లు వంతున వినియోగిస్తే 13,76,56,640 యూనిట్లు వాడుతారు. యూనిట్ కు అదనంగా రూ. 1.21 పైసలు సర్దుబాటు చార్జీలువల్ల ప్రతినెల ఉమ్మడి చిత్తూరు జిల్లాపై రూ.16.65 కోట్లు అదనపుభారం పడనుందని ప్రజాసంఘాల నాయ కులు చెబుతున్నారు. ఇక వెంకటగిరి ట్రాన్స్ కో సబ్ డివిజన్ పరిధిలో వెంకట గిరి మున్సిపాలిటీ, రూర ల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల పరిధిలో మొత్త ం 66149 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 43886 గహ విద్యుత్ కనెక్షన్లు కాగా మిగిలినవి వ్యవసాయ వీధి దీపాలు చిన్న తరహా పరిశ్రమలు మొదలగునవి. గహ విద్యుత్ కనెక్షన్లు ఉన్న 43876మంది సరాసరి నెలకు 110 యూనిట్ల వంతున వినియోగిస్తే 48,26,360 యూనిట్లు వాడుతారు. యూనిట్‌కు సర్దుబాటు చార్జీల రూపం లో అదనంగా రూ.1.21 వంతున ప్రతి నెల రూ 58.39లక్షలు భారం పడనుంది. ఈ సర్దుబాటు చార్జీలు నవంబర్ నెల నుంచి అమల్లోకి రానున్నా యి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్దుబాటు, ఇంధనఖర్చులు తదితర పేర్లతో విద్యుత్ చార్జీలు భారీగా పెంచింది. విద్యుత్ ఛార్జిలు పెరుగుదలపై పేద, మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర అసంతప్తి వ్యక్తం అయింది. ఆసమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచమంటూ ఎన్నికల్లో పెద్ద ఎత్తుకూటమి నేతలు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచేందుకు ఈఆర్‌సీ అనుమతించడంతో వినియో గదారులు తీవ్ర అసం తప్తి వ్యక్తమవుతోంది. ఇప్పట ికైనా ప్రభుత్వం పున రాలోచన చేసి సర్దుబాటు చార్జీ లు నిలుపుదల చే యాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.