పింఛన్ల పంపిణీ రాజకీయ చావుకొచ్చింది!మండుటెండలో వృద్ధుల పాట్లువడదెబ్బకు ఇద్దరు మృతిపెన్షన్‌ కోసం వెళ్లి వృద్ధుడు

పింఛన్ల పంపిణీ రాజకీయ చావుకొచ్చింది!మండుటెండలో వృద్ధుల పాట్లువడదెబ్బకు ఇద్దరు మృతిపెన్షన్‌ కోసం వెళ్లి వృద్ధుడు

పింఛన్ల పంపిణీ రాజకీయ చావుకొచ్చింది!మండుటెండలో వృద్ధుల పాట్లువడదెబ్బకు ఇద్దరు మృతిపెన్షన్‌ కోసం వెళ్లి వృద్ధుడు మృతిప్రజాశక్తి-యర్రావారిపాలెం (తిరుపతి జిల్లా)తిరుపతి జిల్లా నెరబైలు గ్రామపంచాయతీ సచివాలయం నందు బుధవారం పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్‌ అసం సాహెబ్‌ (75) వృద్ధుడు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో పించను కోసం వేచి ఉండగా ఫిట్స్‌ వచ్చి కళ్లు తిరిగి పడిపోయాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మార్గమధ్యంలో మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.వృద్ధురాలి ప్రాణం తీసిన జాప్యంప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా)పింఛన్‌ ఈనెల మూడో తేదీ ఇస్తారని చెప్పడంతో సూళ్లూరుపేట పట్టణంలోని సాయినగర్‌కు చెందిన ఈశ్వరవాక లలితమ్మ (62) గాండ్లవీధిలోని శ్రీ స్వశక్తి భవనంలో ఉన్న సచివాలయానికి మధ్యాహ్నం చేరుకుంది. సాయంత్రం ఆమెకు వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. సూళ్లూరుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తిరుపతి జిల్లాలోలబ్ధిదారుల సంఖ్య – 2,71,477తొలిరోజున బుధవారం పంపిణీ అయిన ఫించన్ల సంఖ్య – 1,16,958సాయంత్రం 7గంటల వరకూ ఫించన్‌ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముగిసే సరికి 43.08శాతం పూర్తైంది. పింఛన్ల రాజకీయం వృద్ధుల ‘చావు’కొచ్చింది.. మండుటెండలో సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. సచివాలయాల వద్ద షామ్యానాలు, తాగునీటి సౌకర్యం అన్నీ ఏర్పాటు చేశారు. అయితే ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు వెళ్లేసరికే వృద్ధులు డీలా పడిపోయారు. యర్రావారిపాలెం మండలం నెరబైలులో ఒకరు, సూళ్లూరుపేటలో ఒకరు మృతిచెందారు. సచివాలయాల వద్ద ఏర్పాట్లు చేసే బదులు, సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే కొంచెం ఆలస్యంగానైనా పింఛన్ల పంపిణీ చేయిస్తే బాగుండేదని, వైసిపి, టిడిపి పింఛన్ల రాజకీయం వృద్ధుల చావుకొచ్చిందని సచివాలయాల వద్ద లబ్దిదారులు గొనుక్కోవడం వినిపించింది. బిఎన్‌ కండ్రిగలో పింఛన్‌ తొందరగా ఎండ రాకముందే తీసుకెళదామని ఉదయమే ఆరు గంటలకే వచ్చేసి వృద్ధులు నిరీక్షించడం కనిపించింది. చాలాచోట్ల సాయంత్రం 4 గంటలపైనే వృద్ధులకు పింఛన్‌ పంపిణీ జరిగింది. ప్రజాశక్తి – యంత్రాంగం – బాలాయపల్లిలో వడగాలులకు వృద్ధులు సచివాలయాలకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. ఆటో ఖర్చు 400-500 అయ్యిందని వాపోయారు. తీరా సచివాలయానికి వస్తే తాగునీటి సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు. మండలంలో 54 గ్రామాలకు 15 సచివాలయాలు ఉన్నాయి. దూర ప్రాంత పింఛన్‌దారులకు ఆటో ఖర్చులు, ఊతకర్ర సాయం తప్పలేదు. – కోటలో 21 పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో పింఛన్లు అందజేశారు. బ్యాంకు నుంచి నగదు మధ్యాహ్నం వరకూ రాకపోవడంతో ఒకింత ఇబ్బంది పడ్డారు. మండలంలోని అన్ని పంచాయతీలకు రెండు కోట్ల రూపాయలు డ్రా చేయాల్సి ఉండగా, బ్యాంకులో నగదు లేక 50 లక్షలు మాత్రమే ఇచ్చారని పంచాయతీ సెక్రటరీ తెలిపారు. గురువారం మిగిలిన వారికి డ్రా చేసి ఇస్తామని ఎంపిడిఒ శంకరయ్య తెలిపారు. – ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం ఆరు గంటలకే సచివాలయాల వద్దకు పింఛన్‌దారులు చేరుకోవడం కనిపించింది. 28 పంచాయతీల్లో షామియానాలు వేసి, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. బ్యాంకు నుంచి మధ్యాహ్నం వరకూ డబ్బులు రాకపోవడంతో వృద్ధులు అప్పటివరకూ వేచి ఉండాల్సి వచ్చింది. ముందుగా అనారోగ్యంతో ఉండేవారికి పింఛన్‌ అందజేశారు. 1.56 కోట్ల రూపాయలు డ్రా చేసి పింఛన్‌దారులకు అందజేస్తున్నట్లు ఎంపిడిఒ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ప్రతి పంచాయతీలో 70 శాతం ఇచ్చినట్లు సెక్రటరీలు తెలిపారు. – వరదయ్యపాలెంలో బుధవారం సాయంత్రం నుంచి పింఛన్లు అందజేశారు. క్రమపద్ధతిలో బారులు తీరి పింఛన్‌ అందించినట్లు ఈవో బసిరెడ్డి తెలిపారు. – శ్రీకాళహస్తి రూరల్‌లో 22 సచివాలయాల పరిధిలో పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపిడిఒ పటాన్‌ రఫీఖాన్‌ తెలిపారు. మండలంలో మొత్తం 9120 మంది లబ్దిదారులు ఉండగా సాయంత్రానికి 3,599 మందికి అందజేశారు.

➡️