భార్యను పొడిచి భర్త ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి-నాయుడుపేట:- భార్యను పొడిచి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో కలకలం రేపింది.  పట్టణంలోని కుమ్మరి వీధిలో నివాసముంటున్న అవగోల.సురేష్ అతని భార్య లత రెండు నెలలుగా పరస్పరం గొడవలు పడుతుండే వాళ్ళు ఈ క్రమంలో ఈమధ్య ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి అక్కడ పోలీసులు వీరిద్దరికీ సద్ది చెట్టి రాజీ కుదిర్చి పంపించారు.అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఈ గొడవలు ఆగక మరింత పెద్దవయ్యాయి ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో భర్త సురేష్ భార్య లత పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఆపై అతను కూడా పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి కేకలు చుట్టుపక్కల వారు గమనించి వారి ఇంటికి చేరుకోగా అప్పటికే బాధితురాలు అపస్మారక స్థితిలో ఉండడంతో స్థానికులు వెంటనే ఆమెను ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లగా డాక్టర్ల పరిశీలించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

➡️