‘నడ్డి’ విరుస్తున్న గతుకుల ‘రోడ్డు’సత్యవేడు-ఊత్తుకోటలో ప్రయాణం నరకం

'నడ్డి' విరుస్తున్న గతుకుల 'రోడ్డు'సత్యవేడు-ఊత్తుకోటలో ప్రయాణం నరకం

‘నడ్డి’ విరుస్తున్న గతుకుల ‘రోడ్డు’సత్యవేడు-ఊత్తుకోటలో ప్రయాణం నరకంప్రజాశక్తి – సత్యవేడు సత్యవేడు-ఊతుకోట రహదారిలో రెగ్యులర్‌గా వాహనాల్లో తిరిగితే మాత్రం నడ్డి విరగాల్సిందే. నడుం చుట్టూ బెల్టు బిగించాల్సిందే.. అంతటి ఘోరంగా ఉంది ఆ రహదారి.. వర్షాలకు ఏర్పడిన గుంతలకు ఆర్‌ అండ్‌ బి అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆ రహదారిలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ఈ రోడ్డు ఇటు తిరుపతి జిల్లా సత్యవేడును తమిళనాడు ఊత్తుకోటను కలిపే ప్రధాన రహదారి. సత్యవేడు నుండి పుత్తూరు ద్వారా తిరుపతికి వెళ్లే వాహనాలన్నీ ఈ రహదారి వైపే వెళతాయి. శ్రీ సిటీకి సంబంధించిన రవాణా వాహనాలు, అందులో పనిచేసేవారి వాహనాలన్నీ ఈ రహదారి మీదే పోతాయి. ఈ రహదారి ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ రోడ్లపై ఏర్పడిన గతుకులు గుంతల వల్ల ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు, రోడ్ల దుస్థితి తమ నడ్డిని విరుస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాకుండా ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం వలన వాహనాలకు పదేపదే టైర్లు మార్చాల్సి వస్తోంది. పదే పదే సర్వీస్‌ చేయించడం వల్ల, ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల అయ్యే ఖర్చు భరించలేకున్నామని తమ బాధను వ్యక్తపరిచారు. రోజూ ప్రయాణికులను ఎక్కించుకొని తిరిగే ఆటోవాలాల పరిస్థితి కూడా ఇంతేనని చెప్పుకొచ్చారు. ఈ రోడ్లలో సుమారు మూడు నుండి నాలుగు అంగుళాల లోతులో గుంతలు ఉండటం, అందులో ఉన్న కాంక్రీట్‌ రాళ్లు కూడా బయటకు రావడంతో వాహనదారులు వాహనాన్ని అదుపు చేయడం కష్టతరం కావడం వల్ల పదేపదే ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఇదే రోడ్డుపై యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్‌ మట్టిని తరలించడం ద్వారా ఈ రోడ్లకు ఈ దుస్థితి ఏర్పడిందని, ఇసుకకు రవాణా వాహనాలకు చలానాల ద్వారా రుసుము వసూలు చేసే ప్రభుత్వ యంత్రాంగం కాస్త ఈ రోడ్ల దుస్థితిని పరిశీలించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే బాగుంటుందని ప్రతిఘటించారు. రానుంది వర్షాకాలం కావడంతో ఇప్పుడే రోడ్ల మరమ్మతులను పూర్తి చేయకుంటే ఈ రోడ్లు మరింత దుస్థితికి చేరుకుని రవాణా కష్టతరం అవుతుందని వాహనదారులు వ్యాఖ్యానించారు. ఇకనైనా ఆర్‌ అండ్‌ బి అధికారులు గతుకుల రోడ్డుపై దష్టి పెట్టి గోతులను గుంతలను పూడ్చి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

➡️