ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
ప్రజాశక్తి-తిరుపతి : మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా మ్యూజిక్ కాలేజీ సర్కిల్లో ఉన్న పూలే విగ్రహానికి గురువారం ఉదయం ఎమ్మెల్యేఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి పూలే అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా పూలే చివరి వరకు పోరాడారన్నారు.పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాకే బీసీలు అభివృద్ధి చెందటంతో పాటు ఆత్మగౌరవం దక్కిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినపల్లి లక్ష్మయ్య, కట్టమంచి చంద్రబాబు, మధు అచ్చారి, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, నైనార్ శ్రీనివాసులు, మునస్వామి, రమేష్ నాయుడు, కొండా రాజ మోహన్, రమేష్, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.