తండ్రి నేత్రాలు దానం చేసిన తనయుడు

తండ్రి నేత్రాలు దానం చేసిన తనయుడు

తండ్రి నేత్రాలు దానం చేసిన తనయుడుప్రజాశక్తి – తిరుపతి సిటి రుయాలో చనిపోయి సి.వి వెంకటరమణ (64) గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని నేత్రాలను దానం చేయడానికి కొడుకు యశ్వంత్‌కుమార్‌ ముందుకొచ్చారు. రుయా కంటి విభాగాధిపతి డాక్టర్‌ చలపతి రెడ్డి ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.రవిప్రభు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు నేత్రాలు, అవయవాలు దానం చేయడం వల్ల పేద రోగులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి ఉచితంగా అమర్చడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పురప్రజలు ఎవరైనా నేత్రదానం చేయాలంటే 8500880126 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేత్ర విభాగ టెక్నీషియన్‌ ఎస్‌.రమేష్‌ పాల్గొన్నారు.

➡️