విద్యుత్‌ కార్యాలయ గేట్లు వేసి ధర్నారోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

విద్యుత్‌ కార్యాలయ గేట్లు వేసి ధర్నారోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

విద్యుత్‌ కార్యాలయ గేట్లు వేసి ధర్నారోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులుప్రజాశక్తి -తొట్టంబేడుగత రెండు నెలలుగా విద్యుత్‌ సమస్య నెలకొన్నదని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోయారు. తొట్టంబేడు ఏఈకి, ఏడికి సమస్యను పలుమార్లు వినిపించుకున్న పట్టించుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు శనివారం విద్యుత్‌ కార్యాలయానికి గేట్లు వేసి శ్రీకాళహస్తి- తడ ప్రధాన రోడ్డు మార్గంలో బైఠాయించారు. రెండు నెలలుగా లో వాల్టేజ్‌ తో నానా అవస్థలు పడుతున్నా మన్నారు. రైస్‌ మిల్లు ఓనర్లు సమస్య ఉందని చెప్పిన వెంటనే పరిష్కరిస్తున్న అధికారులు, తమ గ్రామం వైపు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. రోడ్డుపై ట్రాఫిక్‌ ఎక్కువ అవ్వడంతో టూటౌన్‌ సిఐ రారాజు సంఘటన స్థలానికి చేరుకుని కరెంటు అధికారుల్ని పిలిపించి గ్రామస్తులతో మాట్లాడి రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

➡️