పెళ్లకూరులో ఆటవికం ఓటెయ్యలేదని గిరిజన మహిళపై దాడి నిండు గర్భిణీ అని కూడా చూడని వైసిపీ మూకలు

పెళ్లకూరులో ఆటవికం ఓటెయ్యలేదని గిరిజన మహిళపై దాడి నిండు గర్భిణీ అని కూడా చూడని వైసిపీ మూకలు

పెళ్లకూరులో ఆటవికం ఓటెయ్యలేదని గిరిజన మహిళపై దాడి నిండు గర్భిణీ అని కూడా చూడని వైసిపీ మూకలు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్వాతంత్రం సిద్ధించి 77ఏళ్లు గడిచిపోతున్నా సమాజంలో ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ పార్టీకి ఓటు వెయ్యలేదని కారణంతో ఓ గిరిజన మహిళపై వైసీపీ మూకలు దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెళ్లకూరుమిట్టలో చోటు చేసుకుంది. ఆ గిరిజన మహిళ నిండు గర్భిణీ అన్న సంగతిని కూడా పక్కన పెట్టి వైసీపీ మూకలు దాడి చేయడం సిగ్గుచేటు. గ్రామస్తుల కథనం మేరకు.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. పెళ్ళకూరు మిట్టకు చెందిన అరుణ అనే గిరిజన మహిళ కూడా ఓటింగ్‌ లో పాల్గొంది. అయితే తాము చెప్పిన వారికి కాకుండా టీడీపీ కి ఓటు ఎలా వేస్తావంటూ ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి దాడి చేశారు. గర్భిణీ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డారు. దీంతో బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వారిలో ఓ వాలంటీర్‌ తో పాటు ఆ మండలలో సహకార బ్యాంకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఓ కీలక నేత అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈదాడిపై పెళ్లకూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందగా, విచారణ చేస్తున్నారు.

➡️