అవి చట్టాలా.. ఉరి తాడులా..పమాదకర కొత్త క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలి: సిఐటియు డిమాండ్‌తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్

అవి చట్టాలా.. ఉరి తాడులా..పమాదకర కొత్త క్రిమినల్‌ చట్టాలను రద్దు చేయాలి: సిఐటియు డిమాండ్‌తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాప్రజాశక్తి-తిరుపతి టౌన్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినవి చట్టాలా.. అవి డ్రైవర్‌ల పాలిట ఉరితాడులా అని సిఐటియు నాయకులు ధ్వజమెత్తారు. ప్రమాదకర కొత్త క్రిమినల్‌ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న కోర్కెల దినం సందర్భంగా తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కలెక్టర్‌ ఏవో జయరామలుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్‌ చట్టాలు డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే ముందు లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా, సంస్థల ప్రముఖులతో సంప్రదించాల్సి ఉందన్నారు. కనీసం పార్లమెంటులోనైనా సవివరమైన చర్చ జరగకుండా ప్రతిపక్షాలను గెంటెసి చట్టాల్ని ఆమోదింపజేరని, నాలుగు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారన్నారు. ఆ విధంగా చట్టాలు అమలు చేసింది డ్రైవర్ల గొంతు కోయడానికా అని దుయ్యబట్టారు. ప్రమాదకరమైన చట్టాలతో డ్రైవర్లు పదేళ్ల పాటు జైలుపాలైతే వారి కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దుర్మార్గమైన చట్టాలను తక్షణం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు యన్‌.మాధవ్‌, కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ కఠినమైన చట్టాలతో భారీగా జరిమానాలు, శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయనడం శుద్ధ తప్పు అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.రమణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరు మురళి, సిఐటియు నగర నాయకురాలు పి.బుజ్జి, ఆటో యూనియన్‌ తిరుపతి నగర కార్యదర్శి జి.వాసు, బాదుల్లా, సత్తివేడు మగ, వై.కుమార్‌, వెంకటేష్‌, శ్రీనివాసులు, కేశవులు, కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️