వర్షానికి కూలిన చెట్టుమూడు వాహనాలు ధ్వంసం

వర్షానికి కూలిన చెట్టుమూడు వాహనాలు ధ్వంసం

వర్షానికి కూలిన చెట్టుమూడు వాహనాలు ధ్వంసంప్రజాశక్తి- తిరుమల: తిరుమల బాటగంగమ్మ ఆలయం వద్ద పార్కింగ్‌ ప్రాంతాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి భారీ చెట్టు కూలింది. దీంతో పార్కింగ్‌లో ఉన్న రెండు టెంపో వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి. తమిళనాడుకు చెందిన భక్తులు వరహస్వామి అతిధి గహంలో గది పొంది పార్కింగ్‌లో వాహనాలు పార్క్‌ చేశారు. ఈదురు గాలులు, వర్షం తీవ్రతకు చెట్టు వాహనాలపై కూలింది. చెట్టు కూలిన ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

➡️