నేడే సామాజిక పింఛన్లు పంపిణీ : కలెక్టర్‌తిరుపతి జిల్లాలో రూ.113.01 కోట్లు పంపిణీకి చర్యలుప్రజాశక్తి – తిరుపతి టౌన్ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు సెప్టెంబర్‌నెలలో పంపిణీ చేయాల్సినవి సచివాలయ సిబ్బంది ద్వారా ఈనెల 31న శనివారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో 2,67,089 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.01 కోట్లు పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి చేయనున్నట్లు తెలిపారు. పంపిణీ కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటలకల్లా ప్రారంభించాలని, ఆలస్యం అయితే తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సెప్టెంబర్ 1 ఆదివారం సెలవు దినం కావడంతో ముఖ్యమంత్రి ముందురోజే పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు. బయట గ్రామాలకు వెళ్లిన వారు గ్రామాల్లో అందుబాటులో ఉండి పింఛన్ తీసుకోవాలని సూచించారు. లబ్దిదారులు ఎవరూ సచివాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు.
