ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ: ఎస్‌పి

ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ: ఎస్‌పి ప్రజాశక్తి- తిరుపతి సిటీ: పురప్రజలకు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రత్యేక దష్టి పెడతామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. సోమవారం నగరంలో ముఖ్యమైన కూడళ్ళు, ట్రాఫిక్‌ పాయింట్ల వద్ద తనిఖీలు చేసి విధులలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు కార్యాచరణ దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నగరంలోని ప్రధాన కూడళ్ళు అయిన లీలామహల్‌ సర్కిల్‌, పూర్ణకుంభం సర్కిల్‌, గరుడ సర్కిల్‌, ప్రైవేట్‌ బస్సులు పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రస్తుతం నగరంలో అనుసరిస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీసులతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రణాళికకు కొన్ని సవరణలు చేసి సరి కొత్త ప్రణాళికను దిశ నిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ వెంకట్రావు పరిపాలన, తిరుపతి ట్రాఫిక్‌ డీఎస్పి రమణ కుమార్‌, విధులలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.

➡️