తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలుఅక్రమ హకర్ల ను నియంత్రణకు చర్యలుప్రజాశక్తి తిరుమలవరాహస్వామి అతిథిగృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించిన అనధికారంగా ఉన్న హకర్లను తొలగించాలని చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. హకర్ల వ్యవహారంలో పలు ఫిర్యాదులు రావడంతో నేరుగా టిటిడి చైర్మన్ రంగం లోకి దిగారు. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు గుర్తించిన చైర్మన్ అనధికార హాకర్లను వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను అదేశించారు.టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలి, నిభందనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక జారీచేశారు. లైసెన్స్ ప్రకారం కేటాయించిన స్థలం లో కాకుండా భక్తులకు ఇబ్బంది కలిగించేలా వ్యాపారాలు జరిపితే….కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
