జర్నలిస్టులకు భద్రత కల్పించండి పోలీసులకు యూనియన్‌ నాయకుల వినతి

జర్నలిస్టులకు భద్రత కల్పించండి పోలీసులకు యూనియన్‌ నాయకుల వినతి

జర్నలిస్టులకు భద్రత కల్పించండి పోలీసులకు యూనియన్‌ నాయకుల వినతిప్రజాశక్తి- తిరుపతి (మంగళం): ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే తాము నేడున్న పరిస్థితుల్లో నిబద్ధతగా జర్నలిస్టు విధులను నిర్వహించలేకపోతున్నామని, కొందరు ప్రజాప్రతినిధులు జర్నలిస్టులను టార్గెట్‌ చేసుకొని మాట్లాడడం, బెదిరింపులకు దిగడం, మంగళవారం శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన హింసాత్మక ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై పోలీసులు లాఠీచార్జీ చేసి విధులకు అడ్డు తగలడం పట్ల జర్నలిస్టు సంఘాలకు చెందిన నాయకులు పోలీసులకు వినతి ఇచ్చారు. బుధవారం అలిపిరి పోలీస్‌ స్టేషన్లో ఏఎస్పి కులశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాప్రతినిధుల అక్రమ చుట్టాలను పత్రికల ద్వారా బయటపెట్టినందుకు బహిరంగ బెదిరింపులే కాకుండా ఇళ్ల వద్దకు రెక్కీ పంపిస్తున్నారని ఏఎస్పి ఎదుట వాపోయారు. మంగళవారం సిఆర్పిఎఫ్‌ బలగాలు అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి సూచనలతోనే మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లపై లాఠీలతో కొట్టారని, ఆ గాయాలను ఏఎస్పికి చూపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా విధులు నిర్వహించే జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

➡️