గత పాలనకు భిన్నంగా కొనసాగించాలిప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

గత పాలనకు భిన్నంగా కొనసాగించాలిప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి

గత పాలనకు భిన్నంగా కొనసాగించాలిప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలిప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత పాలనకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజాసమస్యలపై దష్టి పెట్టాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు తెలిపారు. శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా సమావేశం సురేంద్రన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా అరాచకాలను దౌర్జన్యాలను ప్రజా ఉద్యమాలను ఉక్కు పాదంతో అణచివేయడానికి వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పాలన కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవహరించిన దమనకాండకు ప్రజలు చరమగీతం పాడారని, ఏ పాలకులైన ప్రజావ్యతిరేక విధానాల అవలంభిస్తే ఇదే గతి పడుతుందన్నారు. అందుకే ప్రజలు వైసీపీని కోలుకోని విధంగా అతి దారుణంగా ఓడించారని తెలిపారు. నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తే విధంగా పాలన కొనసాగించాలని, కేంద్రంలో ఉన్న మతోన్మాద ప్రభుత్వం మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంపీలపై ఆధారపడి అధికారంలోకి రాబోతున్నదన్నారు. ఇప్పటికే కేంద్రంలోని ఎన్నికల అయిపోయిన వెంటనే ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపారని, భవిష్యత్తులో కూడా అనేకరకాల భారాలు మోపుతారని అలాంటి భారాలు మోపకుండా రాష్ట్రంలోని ఎంపీలు కట్టడి చేసే విధంగా ఉంటూ ప్రజల అండగా నిలవాలని కోరారు. సిపిఎం నిరంతరం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించే ప్రభుత్వాలపై సిపిఎం పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నియోజకవర్గం కషి చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నడుచుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో ప్రజలకు అండగా సిపిఎం నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్‌ రాజు, గిరిధర్‌ గుప్తా, భువనేశ్వరి, నాయకులు బాలసుబ్రమణ్యం, మురళి, జ్యోతిరావు, దాము, చిరంజీవమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️