ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడికి అస్వస్థతచికిత్స పొందుతూ కోమాలోకి..పరిస్థితి విషమంపట్టించుకోని ఎన్నికల సంఘంఈసీ తీరుపై యూటీఎఫ్‌ ఆగ్రహం

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడికి అస్వస్థతచికిత్స పొందుతూ కోమాలోకి..పరిస్థితి విషమంపట్టించుకోని ఎన్నికల సంఘంఈసీ తీరుపై యూటీఎఫ్‌ ఆగ్రహం

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడికి అస్వస్థతచికిత్స పొందుతూ కోమాలోకి..పరిస్థితి విషమంపట్టించుకోని ఎన్నికల సంఘంఈసీ తీరుపై యూటీఎఫ్‌ ఆగ్రహం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు కండ్రిగసార్వత్రిక ఎన్నికల విధులకు హాజరైన సుమన్‌ రావు అనే ఉపాధ్యాయుడు తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. సకాలంలో మెరుగైన వైద్యం అందక కోమాలోకి వెళ్లాడు.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం చిన్నయ్యగుంట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న సుమన్‌ రావును ఎన్నికల విధులు నిమిత్తం గూడూరు నియోజకవర్గంలోని చెందోడు గ్రామం పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌ 176కు ఈనెల 12వ తేదీన పంపారు. ఆరోజు రాత్రి ఆరోగ్యపరంగా సుమన్‌ రావు ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆ విషయం పీఓకి తెలియజేశారు. అయినా పట్టించుకోకపోవడంతో 13వ తేదీ ఉదయం స్నానం చేసి 5గంటలకే పోలింగ్‌ విధులకు హాజరయ్యారు. అయితే ఉదయం 8 గంటల సమయంలో టిఫిన్‌ చేసి తిరిగి విధుల్లోకి వెళ్ళగా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, గ్యాస్ట్రిక్‌ టాబ్లెట్‌ ఇచ్చి ప్రధమ చికిత్స చేశారు. అయినా సుమన్‌ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కోట ప్రాథమికఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో సుమన్‌ వెంట ఏఒక్కరిని సహాయకులుగా పంపకపోవడం గమనార్హం. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమన్‌ చికిత్స పొందుతూ కోమాలోకి చేరుకున్నాడు. వైద్యులు సిపిఆర్‌ చేసి ఆయనకు ఆక్సిజన్‌ అందడం లేదని గుర్తించి వెంటనే మెరుగైనవైద్యం కోసం తరలించాలని సూచించారు. దీంతో సుమన్‌ను నెల్లూరు అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఎన్నికల విధులకు హాజరైన శ్రీకాళహస్తి ప్రాంత ఉపాధ్యాయుడికి ప్రాణాపాయం తలెత్తినా కూడా ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కనీసం సుమన్‌ రావు ఆరోగ్య పరిస్థితి పై గానీ, ఆ ఘటనపై కానీ ఎన్నికల అధికారులు కనీస ప్రకటన చేయకపోవడంపై శ్రీకాళహస్తి యూటీఎఫ్‌ నాయకులు అసంతప్తిని వ్యక్తం చేశారు. వెంటనే సుమన్‌ రావు కోలుకునేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఈసీ అందజేయాలని డిమాండ్‌ చేశారు.

➡️