రెవెన్యూ కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు

రెవెన్యూ కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు

రెవెన్యూ కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు ప్రజాశక్తి- గుడుపల్లి: మండలం రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.32 గంటలు అయినా… ఏ ఒక్క అధికారి రాకపోవడంతో మండల రెవెన్యూ కార్యాలయం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది… అయితే అప్పటికే మండల పరిధిలోని సుదూర ప్రాంతాల నుండి రైతులు వచ్చి ఎదురు చూస్తున్నా కూడా పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బంది మాత్రం విధులకు హాజరు కాకపోవడం ఎంత నిర్లక్ష్యమని రైౖతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత మండల రెవెన్యూ సర్వేర్‌, ఒకే ఒక్క వీఆర్వో తప్ప అప్పటికి ఎవరు రాకపోవడం గమనార్హం.. గతంలో ఎలా జరిగిన ఇకనైనా అధికారులు తీరు మార్చుకుని సమయపాలన పాటిస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని మండల ప్రజలు కోరుతున్నారు.

➡️