వ(హ)ర్షం..!జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆనందంనాట్లు వేసుకునేవారికి మంచిదిరెండోకారు పంటకూ ఉపయోగం

వ(హ)ర్షం..!జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆనందంనాట్లు వేసుకునేవారికి మంచిదిరెండోకారు పంటకూ ఉపయోగం

వ(హ)ర్షం..!జిల్లావ్యాప్తంగా రైతుల్లో ఆనందంనాట్లు వేసుకునేవారికి మంచిదిరెండోకారు పంటకూ ఉపయోగంప్రజాశక్తి – యంత్రాంగం తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో వర్షం పడింది. మే నెల మొదటి పక్షంలో ఎండలు ఠారెత్తించాయి. పోలింగ్‌ రోజునా ఓటర్లు మండుటెండలో అల్లాడిపోయారు. రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ఆహ్లాదంగా కనిపించింది. తిరుపతి జిల్లా తూర్పు మండలాల్లో ఇప్పటికే నాట్లు నాటుతున్న రైతులకు ఈ వర్షం ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రెండో కారుగా వేరుశనగ వేసిన వారికి మంచిదేనని తెలిపారు. తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో పెద్దఎత్తున వర్షం కురిసింది. డక్కిలి.. వెంకటగిరి, డక్కిలి సహా పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అక్కడక్కడ వర్షం కురిసింది. ఉదయమంతా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాగునీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న నిమ్మ, మామిడి పండ్ల తోటలకు వర్షం ఊరటనిచ్చింది. వెంకటగిరి రూరల్‌ : వరి సాగుకు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మండల ప్రాంతాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రబీ పంట కోసిన అనంతరం కొంతమంది రైతులు సాగునీరు అనుకూలంగా ఉండే రెండో దఫా వరి పంటలు (1010) రకాలు వేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ వర్షం ఎంతో ఓదార్పుగా నిలిచింది.

➡️