శ్రీవారి సేవలో వీవీఎస్‌ లక్ష్మణ్‌

శ్రీవారి సేవలో వీవీఎస్‌ లక్ష్మణ్‌

శ్రీవారి సేవలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ప్రజాశక్తి -తిరుమలభారత మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. శనివారం వేకువ జామున సుప్రభాతం, తోమాల సేవలో భారత మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వివిఎస్‌ లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల అఖిలాండం వద్ద బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

➡️