ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణి వారోత్సవాలు ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాల జూ పార్క్ లో వన్యప్రాణి వారోత్సవాలను జూ పార్క్ క్యూరేటర్ సెల్వం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జూ పార్కు క్యూరేటర్ సెల్వం మాట్లాడుతూ ఈ వన్యప్రాణి వారోత్సవాలు ఈనెల 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. చిన్నారులలో అడవుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, చిత్రలేఖనం వంటి కార్యక్రమా లను నిర్వహిస్తామన్నారు. మొదటిరోజు 200 మంది విద్యార్థులకు చిత్ర లేఖనం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జూ అధికారులు పాల్గొన్నారు.