నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులు : మంత్రి సవిత

Feb 4,2025 18:41 #Kadapa, #Minister Savitha

ప్రజాశక్తి – కడప : నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని జిల్లా ఇంచార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 37 వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించాలని, అలాగే ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు క్రమశిక్షణ కు మారుపేరుగా ఉందని అన్నారు. క్రీడలవల్ల ప్రతిభా పాటవాలు, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగు తుందన్నారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజం అని ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలన్నారు. నేటి విద్యార్థులే రేపటి భావిభారత పౌరులని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. భావితరాల భవిష్యత్ కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునాది రాళ్లు వేస్తున్నారని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ ఆలోచన తో రేపటి కొరకు ముందుకు వెళ్తున్నారన్నారు. మనందరికోసం ఎంతో కష్ట పడుతున్నారని అన్నారు. విద్య, క్రీడల తోపాటు టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలని అన్నారు. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలన్నారు. తలిదండ్రులు మీ కోసం ఎంతో అహర్నిశలు కష్ట పడతారని వారి కష్టం మరచి గర్వించేలా కష్టపడి చదవాలని అన్నారు. అన్ని రంగాలలో ముందుండాలని, అలాగే బాలికలు కూడా బాలుర తో పాటు ముందుడాలని అన్నారు.
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు నందు 37 వ క్రీడా దినోత్సవ వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడలు మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. అన్ని అంశాల్లో చురుగ్గా ఉంటామని, క్రీడల వల్ల నాయకత్వపు లక్షణాలు, ఆలోచనలు వస్తాయని, ఉన్నతస్థాయి ఎదుగుదలకు దోహద పడతాయన్నారు. ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని అన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు కు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
టిడిపి జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థులు మంచి క్రమశిక్షణ తో ఉన్నారని అన్నారు. 37 వ క్రీడా దినోత్సవ వేడుకలలో మార్చిపాస్ట్ ఎంతో అద్భుతంగా చేశారని అన్నారు. ఎంతో మంది మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థులు కడప నగరంలో ట్రాఫిక్, ట్రాన్స్పోర్ట్, స్వచ్ఛంద్రప్రదేశ్ తదితర ఎన్నో కార్యక్రమాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అభినందనలు తెలిపారు.
తొలుత మంత్రివర్యులు 37వ క్రీడా దినోత్సవ వేడుకల మార్చిపాస్ట్ వందనం స్వీకరించారు. 37వ క్రీడా దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రీడా దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించారు. మంత్రివర్యులు 37వ క్రీడా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో షంషుద్దీన్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు డైరెక్టర్ ఎం.వివేకానందరెడ్డి, ప్రిన్సిపల్ పి. హరి కృష్ణ, ఇంచార్జి సంధ్య, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️